ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎంపీ ప్రియాంక గాంధీను కలిసి మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై చర్చించి కృతజ్ఞతలు తెలిపారు.

విధాత : తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాను కలిశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో డీలిమిటేషన్ బిల్లు పెట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలనుకున్న బీజేపీ కుట్రను లోక్ సభలో విజయవంతంగా తిప్పికొట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రజాస్వామ్య విరుద్ధంగా చేపట్టిన రాజ్యాంగ సవరణను అడ్డుకునేందుకు, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు మద్దతుగా నిలిచినందుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఇచ్చిన అల్పహార విందుకు హాజరయ్యారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు హాజరవ్వడం విశేషం.

ఇవి కూడా చదవండి :

ఒక్క మారేడు చాలు..శివుడు, లక్ష్మీ ప్రసన్నం..ఆరోగ్యం!
తెలంగాణ సర్కారు కుల సర్వేలో ‘విశ్వకర్మ’ల విచిత్ర పరిస్థితి

Latest News