Revanth Reddy : కేసీఆర్ ను కలవడం ఇది రెండోసారి
అసెంబ్లీలో కేసీఆర్‌ను పలకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆయనను కలవడం ఇది రెండోసారి.. మర్యాదపూర్వకంగానే పలకరించాను" అని మీడియా చిట్ చాట్‌లో వెల్లడించారు.
విధాత, హైదరాబాద్ : శాసన సభలో మాజీ సీఎం కేసీఆర్‌ను పలకరించిన సందర్భంపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో స్పందించారు. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించాను. ప్రతి సభ్యుడిని మేం గౌరవిస్తాం అని.. తాను కేసీఆర్‌ను కలవడం ఇది మొదటిసారి కాదు.. రెండోసారి అని గుర్తు చేశారు.
గతంలో కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా కలిశానని తెలిపారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మేమిద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం? అని సీఎం వ్యాఖ్యానించారు. అక్కడ అడగకుండా ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ సభ నుంచి వెంటనే ఎందుకు వెళ్లిపోయారో అది ఆయన్నే అడగాలి అన్నారు.
ఇవి కూడా చదవండి :
Beerla Ilaiah : పదవి..జీతం కోసం కేసీఆర్ సభకు వచ్చి వెళ్లాడు : బీర్ల ఐలయ్య
Srikanth | టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్‌కు ఈ స్టార్ నటి బంధువు అని మీకు తెలుసా?.. ఏం వరుస అవుతుందంటే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram