విధాత, హైదరాబాద్ : గతంలో రాజకీయ ఒత్తిళ్లతో ప్రజాప్రతినిధులపైన, పలు పార్టీల నాయకులపైన పెట్టిన పోలీస్ కేసులను ఉపసంహరించుకునేలా డీజీపీని ఆదేశించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. రాజకీయ ఒత్తిళ్లతో నమోదైన కేసులను రద్దు చేయాలని కోరారు. గతంలో అధికార పార్టీ ఆదేశాలతో ప్రత్యర్థులపై చిన్న చిన్న తప్పిదాలపై కూడా కేసులు నమోదు చేశారని, వీటిలో అనేక కేసుల్లో చాలా కాలంగా ఎటువంటి విచారణ జరగడం లేదన్నారు. అందువల్ల ఈ కేసులను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. గతంలో కూడా జిల్లా కలెక్టర్ లేదా డీజీపీ సలహాలు తీసుకుని చాలా కేసులు వాపస్ తీసుకున్నారని, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరగాలని కోరారు. ఈ సందర్భంగా కొంత మంది నేతలపై నమోదైన కేసుల వివరాలను పద్మనాభరెడ్డి లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై కూడా 89 కేసులు నమోదు చేశారని, వీటిలో రెండు, మూడు కేసులు మినహాయిస్తే మిగిలిన కేసులన్నీ అతి చిన్న తప్పిదాలకు రాజకీయ ఒత్తిళ్లతో నమోదు చేసినవేనన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పైన గతంలో 42 కేసులు నమోదు చేశారని, ఇందులో చాలా వరకు కేసులు చిన్న చిన్న తప్పిదాలపై నమోదు చేసినవే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా తెలంగాణ ఉద్యమకాలానికి సంబంధించిన కేసులు ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జపై 52 కేసులు నమోదు చేశారని, గోండుల హక్కుల కోసం పోరాటం చేయడమే అతడు చేసిన నేరమని కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులన్నీ కూడా ఎటువంటి నేరార్హమైనవి కావన్నారు.
రాజకీయ ఒత్తిళ్లతో పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి … సీఎం రేవంత్‌రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతి
గతంలో రాజకీయ ఒత్తిళ్లతో ప్రజాప్రతినిధులపైన, పలు పార్టీల నాయకులపైన పెట్టిన పోలీస్ కేసులను ఉపసంహరించుకునేలా డీజీపీని ఆదేశించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరారు

Latest News
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస