• Telugu News
  • /Telangana

Lok Sabha Elections | హీరో వెంకటేశ్‌కు, మంత్రి పొంగులేటికి ఆ కాంగ్రెస్‌ అభ్యర్థి వియ్యంకుడు..!

Lok Sabha Elections | తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. బుధవారం మిగిలిన మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును, హైదరాబాద్ అభ్యర్థిగా మహ్మద్ వలీఉల్లా సమీర్‌ను, ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రాఘురామ్ రెడ్డిని ప్రకటించింది.

Reported by: Thyagi | తెలంగాణ‌ | Apr 25, 2024, 3:46 pm IST
Read Time: 3 mins
Lok Sabha Elections | హీరో వెంకటేశ్‌కు, మంత్రి పొంగులేటికి ఆ కాంగ్రెస్‌ అభ్యర్థి వియ్యంకుడు..!

Lok Sabha Elections : తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. బుధవారం మిగిలిన మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును, హైదరాబాద్ అభ్యర్థిగా మహ్మద్ వలీఉల్లా సమీర్‌ను, ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రాఘురామ్ రెడ్డిని ప్రకటించింది.

అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పై ముగ్గురు ఎంపీ అభ్యర్థుల్లో ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురామ్‌ రెడ్డి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఇద్దరు ప్రముఖులకు వియ్యంకుడిగా ఉన్నారు. ఆ ఇద్దరు ప్రముఖుల్లో ఒకరు తెలుగు సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ కాగా, మరొకరు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వెంకటేశ్ పెద్ద కుమార్తె అశ్రిత దగ్గుబాటిని రఘురాం రెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకున్నారు.

అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని రఘురామ్‌ రెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. అలా రఘురామ్ రెడ్డి అటు హీరో వెంకటేశ్‌కు, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియ్యంకుడు అయ్యారు. రామసహాయం రఘురాం రెడ్డి తండ్రి పేరు సురేందర్ రెడ్డి. ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. చాలా ఏళ్ల క్రితం ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.

ఇప్పుడు వయోభారం కారణంగా సురేందర్‌ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో ఆయన స్థానంలో కుమారుడు రఘురామ్‌ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.