విధాత : సీపీఎం పార్టీ మరో ముగ్గురి అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 14మంది అభ్యర్థులను, రెండో జాబితాలో ఇద్దరిని, మూడో జాబితాలో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం ఇప్పటిదాకా 19స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మూడో జాబితాలో కోదాడ అభ్యర్థిగా మట్టిపెల్లి సైదులు, మునుగోడు అభ్యర్థిగా దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందుకు దుగ్గి కృష్ణను అభ్యర్థిగా ప్రకటించింది. మునుగోడులో సీపీఐ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఇక్కడ సీపీఎం తన అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో సీపీఐకి గణనీయ స్థాయిలో ఉన్న ఓటర్లు పొత్తు ధర్మం మేరకు కాంగ్రెస్ వెంట నడుస్తారా లేక, సీపీఎం అభ్యర్థికి సహకరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.