17చోట్ల సీపీఎం పోటీ: తమ్మినేని ప్రకటన

  • Publish Date - November 2, 2023 / 11:20 AM IST

విధాత : కాంగ్రెస్‌తో పొత్తు బెడిసికొట్టడంతో ఒంటరి పోరాటానికి సిద్ధమైన సీపీఎం పార్టీ తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీపీఎం పోటీ చేయనున్న స్థానాల వివరాలను వెల్లడించారు.

వాటిలో భద్రాచలం(ఎస్టీ), అశ్వరావుపేట(ఎస్టీ), పాలేరు, మధిర(ఎస్సీ), వైరా(ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి(ఎస్సీ), మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్(ఎస్సీ), భువనగిరి, హుజూర్ నగర్‌, కోదాడ, జనగాం ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు. పార్టీ మ్యానిఫెస్టో, అభ్యర్థులను వెంటనే ప్రకటిస్తామని తెలిపారు.