విధాత:విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శ్రీ ముఖాలు జారీ చేసిన కలెక్టర్ 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం.
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో అమలుచేయడంలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మంగళవారం కొరడా ఝులిపించారు.జిల్లాలోని ఒక ఎంపీడీఓ, ఇద్దరు ఎంపీఓలు, ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు మెమోలు,ఇద్దరు సర్పంచులు ఒక ఉపసర్పంచ్ కు షోకాజు నోటీసులు జారీ చేశారు.తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.వీటికి సంబంధించి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టం ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.