Telangana Train Alerts : తెలంగాణలో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
తెలంగాణలో భారీ వర్షాల వల్ల 36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, 14 రైళ్లు పాక్షికంగా రద్దు; ప్రయాణికులకు హెల్ప్‌లైన్.

Telangana Train Alerts | విధాత : తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రైలు పట్టాలను వరద నీరు ముంచెత్తింది. తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు ఉద్ధృతికి కామారెడ్డి- భిక్కనూర్ సమీపంలో తలమట్ల వద్ధ రైలు పట్టాల కింద గండిపడింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేసి..కొన్నింటిని దారి మళ్లించినట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ తెలిపారు. 36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, 14 రైళ్లను పాక్షిక్షంగా రద్దు చేసినట్లు ఆయన వివరించారు.
భారీవర్షాల నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. కాచిగూడ – 90633 18082, నిజామాబాద్ – 97032 96714, కామారెడ్డి – 92810 35664, సికింద్రాబాద్ – 040 277 86170 నంబర్లను సంప్రదించాలని రైల్వే శాఖ సూచించింది.