విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. తెలంగాణలో గుర్తింపు పొందిన పార్టీల్లో జనసేన లేకపోవడంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గ్లాసు గుర్తు రిజర్వ్ చేయలేదు.
దీంతో జనసేన ఏపీలో వాడుతున్న గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం జన సేన అభ్యర్థులకు కేటాయించలేకపోయింది. ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును ఫ్రీ సిబంల్ లిస్టులోనే పెట్టారు. దీంతో 8 స్థానాల్లో పోటీలో ఉన్నజనసేన అభ్యర్థులు ఇండిపెండెంట్‌లుగానే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.