11న సైనిక విద్యాలయాల ప్రవేశ పరీక్ష

విధాత,హైదరాబాద్‌:తెలంగాణ సాంఘిక సంక్షేమ,గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ప్రారంభమైన సైనిక విద్యాలయాల్లో 6వ తరగతి,ఇంటర్‌ (ఎంపీసీ)లో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లోని సాంఘిక సంక్షేమ సైనిక విద్యాలయం,నర్సంపేట అశోక్‌ నగర్‌లోని గిరిజన సైనిక విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్‌(ఎంపీసీ)లో బాలుర అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష జరుగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. […]

11న సైనిక విద్యాలయాల ప్రవేశ పరీక్ష

విధాత,హైదరాబాద్‌:తెలంగాణ సాంఘిక సంక్షేమ,గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ప్రారంభమైన సైనిక విద్యాలయాల్లో 6వ తరగతి,ఇంటర్‌ (ఎంపీసీ)లో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లోని సాంఘిక సంక్షేమ సైనిక విద్యాలయం,నర్సంపేట అశోక్‌ నగర్‌లోని గిరిజన సైనిక విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్‌(ఎంపీసీ)లో బాలుర అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష జరుగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 10గంటల వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.