పరీక్షలు జరుపుతాము: మంత్రి సబిత

హైదరాబాద్‌,విధాత‌: అన్ని అంశాలను పరిశీలించాకే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని విద్యాశాఖ‌మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఓయూ, జేఎన్టీయూ విద్యార్థులు సోమవారం ఉదయం మంత్రి సబిత ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన మంత్రి సబిత విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులు కోరిన చోట పరీక్షలు రాసే అవకాశం కల్పించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు […]

  • Publish Date - July 5, 2021 / 05:55 AM IST

హైదరాబాద్‌,విధాత‌: అన్ని అంశాలను పరిశీలించాకే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని విద్యాశాఖ‌మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఓయూ, జేఎన్టీయూ విద్యార్థులు సోమవారం ఉదయం మంత్రి సబిత ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన మంత్రి సబిత విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులు కోరిన చోట పరీక్షలు రాసే అవకాశం కల్పించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని మంత్రి సబిత స్పష్టం చేశారు.