సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో భారీ అగ్నిప్ర‌మాదం.. రెండు కోచ్‌లు ద‌గ్ధం

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో గురువారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఆలుగడ్డ బావి వద్ద రైల్‌ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జిపై స్పేర్‌ కోచ్‌ల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో భారీ అగ్నిప్ర‌మాదం.. రెండు కోచ్‌లు ద‌గ్ధం

హైద‌రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో గురువారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఆలుగడ్డ బావి వద్ద రైల్‌ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జిపై స్పేర్‌ కోచ్‌ల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మరో కోచ్‌కు మంటలు వ్యాపించడంతో పెద్దఎత్తున పొగలు ఎగసిపడ్డాయి. 2 స్పేర్ కోచ్‌లు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. ఆ కోచ్‌ల్లో ప్ర‌యాణికులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింది. స్థానికులు అందించిన స‌మాచారంతో అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక మంట‌లు చెల‌రేగిన స‌మ‌యంలో బ్రిడ్జి కింది నుంచి వెళ్లిన వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.