విధాత : నేను బీజేపీ పార్టీలోనే కొనసాగుతానని, కాంగ్రెస్‌లోకి వెలుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత వ్యవహారమని, నేను మాత్రం పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. బీఆరెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించడం ఖాయమన్నారు.