మేడ్చల్ జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాల్టీలు
మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విధాత: మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాచవాని సింగారం, ప్రతాప సింగారం, చౌదరిగూడ, వెంకటాపురం గ్రామ పంచాయతీలను ప్రభుత్వం కొత్త మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటికే ఆ పంచాయతీల పరిధిలో రియల్ వ్యాపారం పుంజుకోవడం, భూముల ధరలు పెరిగాయి. తాజాగా అవి మున్సిపాల్టీలుగా ఏర్పాటు కావడంతో రియల్ వ్యాపారం మరింత పుంజుకోనుందని భావిస్తున్నారు.