NIMS | రేపు నిమ్స్‌లో హెల్త్ క్యాంప్.. కేవ‌లం వారికే ఉచిత ప‌రీక్ష‌లు..!

NIMS | సీనియ‌ర్ సిటిజ‌న్ల ఆరోగ్య భ‌ద్ర‌త విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌జా పాల‌న - ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లో భాగంగా మార్చి 31వ తేదీన నిమ్స్‌లో హెల్త్ క్యాంపు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.

  • By: raj |    telangana |    Published on : Mar 30, 2026 7:45 AM IST
NIMS | రేపు నిమ్స్‌లో హెల్త్ క్యాంప్.. కేవ‌లం వారికే ఉచిత ప‌రీక్ష‌లు..!

NIMS | సీనియ‌ర్ సిటిజ‌న్ల ఆరోగ్య భ‌ద్ర‌త విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌జా పాల‌న – ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లో భాగంగా మార్చి 31వ తేదీన నిమ్స్‌లో హెల్త్ క్యాంపు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ హెల్త్ క్యాంపు కేవ‌లం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని సంబంధిత అధికారులు స్ప‌ష్టం చేశారు.

కంప్లీట్ బ్ల‌డ్ పిక్చ‌ర్ (CBP), ర్యాండ‌మ్ బ్ల‌డ్ షుగ‌ర్, సీరం క్రియాటిన్, ఈసీజీ వంటి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష‌ల అనంత‌రం సంబంధిత వైద్యుల‌తో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఉచిత ఫిజియోథెర‌పీ స‌ర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.

వేదిక ఎక్క‌డంటే..?

నిమ్స్ ఓల్డ్ బ్లాక్‌లోని నెఫ్రాల‌జీ సెమినార్ హాల్‌లోని గ్రౌండ్ బ్లాక్‌లో టెస్టుల నిర్వ‌హ‌ణ‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు మెడిక‌ల్ టెస్టుల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి

హెల్త్ క్యాంపుకు వ‌చ్చే సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌ప్ప‌నిస‌రిగా త‌మ ఆధార్ కార్డుల‌ను వెంట తెచ్చుకోవాల‌ని అధికారులు సూచించారు. ఆధార్ కార్డు లేక‌పోతే వైద్య ప‌రీక్ష‌లు చేయ‌లేమ‌ని పేర్కొన్నారు.