టీడీపీలోకి తీగ‌ల కృష్ణారెడ్డి..! త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు స‌మ‌క్షంలో చేరుతా..!!

జీహెచ్ఎంసీ( GHMC ) మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy ) తిరిగి సొంత‌గూటికి చేరుతున్నారు. తెలంగాణ(Telangana ) తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) తీర్థం త్వ‌ర‌లోనే పుచ్చుకుంటాన‌ని తీగ‌ల కృష్ణారెడ్డి ప్ర‌క‌టించారు.

టీడీపీలోకి తీగ‌ల కృష్ణారెడ్డి..! త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు స‌మ‌క్షంలో చేరుతా..!!

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ( GHMC ) మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy ) తిరిగి సొంత‌గూటికి చేరుతున్నారు. తెలంగాణ(Telangana ) తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) తీర్థం త్వ‌ర‌లోనే పుచ్చుకుంటాన‌ని తీగ‌ల కృష్ణారెడ్డి ప్ర‌క‌టించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్( Andhra Pradesh ) సీఎం చంద్ర‌బాబు( CM Chandrababu )తో భేటీ ముగిసిన అనంత‌రం తీగ‌ల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. చంద్ర‌బాబు వ‌ల్లే హైద‌రాబాద్( Hyderabad ) అభివృద్ధి చెందింది అని తెలిపారు. తెలంగాణ‌లో టీడీపీకీ భారీగా అభిమానులు ఉన్నార‌ని తెలిపారు. తెలంగాణ‌లో టీడీపీకి పూర్వ వైభ‌వం తీసుకొస్తామ‌ని తీగ‌ల కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.

తీగ‌ల కృష్ణారెడ్డి గతంలో హుడా ఛైర్మన్‌​గా, హైదరాబాద్ నగర మేయర్‌​గా, ఎమ్మెల్యేగా పని చేశారు. 2014లో బీఆర్ఎస్‌( BRS Party )​లో చేరారు. 2024, ఫిబ్ర‌వ‌రిలో కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తీర్థం పుచ్చుకున్నారు. తీగ‌ల కృష్ణారెడ్డి కోడ‌లు, రంగారెడ్డి జ‌డ్పి చైర్‌ప‌ర్స‌న్ తీగ‌ల అనితారెడ్డి( teegala Anitha Reddy ) కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.