కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా బీఆరెస్‌లో గ‌త కొంత కాలంగా జ‌రుగుతున్న స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. బీఆరెస్ సీనియ‌ర్ నేత, తెలంగాణ శాస‌నమండి చైర్మెన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు

  • Publish Date - April 29, 2024 / 05:57 PM IST

కండువా క‌ప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి

విధాత‌: న‌ల్ల‌గొండ జిల్లా బీఆరెస్‌లో గ‌త కొంత కాలంగా జ‌రుగుతున్న స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. బీఆరెస్ సీనియ‌ర్ నేత, తెలంగాణ శాస‌నమండి చైర్మెన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సోమ‌వారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుత్తా అమిత్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కండువా క‌ప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.