Half Day Schools | విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. నేటి నుంచి 30వ తేదీ వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు

Half Day Schools | స‌మ్మ‌ర్ హాలిడేస్( Summer Holidays ) రాలేనే లేదు.. ఒంటిపూట బ‌డులు( Half Day Schools ) ఏంట‌ని అనుకుంటున్నారా..? కానీ ఇది నిజ‌మే. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం( Telangana Govt ) ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న కుల గ‌ణ‌న స‌ర్వే( Caste Census ) నేప‌థ్యంలో.. ఒంటిపూట బ‌డుల నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకుంది.

  • By: raj |    telangana |    Published on : Nov 06, 2024 8:15 AM IST
Half Day Schools | విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. నేటి నుంచి 30వ తేదీ వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు

Half Day Schools | స‌మ్మ‌ర్ హాలిడేస్( Summer Holidays ) రాలేనే లేదు.. ఒంటిపూట బ‌డులు( Half Day Schools ) ఏంట‌ని అనుకుంటున్నారా..? కానీ ఇది నిజ‌మే. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం( Telangana Govt ) ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న కుల గ‌ణ‌న స‌ర్వే( Caste Census ) నేప‌థ్యంలో.. ఒంటిపూట బ‌డుల నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఎందుకంటే.. ఈ స‌ర్వేలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌ను( Govt Teachers ) భాగ‌స్వామ్యం చేసింది. ప్ర‌భుత్వ టీచ‌ర్లు కుల గ‌ణ‌న స‌ర్వేలో పాల్గొని వివ‌రాలు సేక‌రించ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రాథమిక పాఠశాలలు( Primary Schools ) నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ( School Education ) నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కులగణనకు మొత్తం పాఠశాల విద్యా శాఖ నుంచి 50 వేల మంది వరకు సిబ్బందిని వినియోగించనున్నారు.

ఇందులో 36,559 మంది ఎస్జీటీ, 3,414 మంది ప్రైమరీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, 6,256 మంది ఎంఆర్​సీలు, 2 వేల మంది ప్రభుత్వ మినిస్టీరల్ స్టాఫ్ సహా వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధనా పరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు కులగణన నుంచి మినహాయింపు ఇచ్చారు. సర్వే పూర్తి అయ్యేవరకు ఇది అమల్లో ఉంటుందని ఇప్పటికే సర్కార్​ స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొననున్న ఉపాధ్యాయులకు ప్లానింగ్ డిపార్ట్​మెంట్​ వేతనాలు చెల్లిస్తుందని వెల్లడించింది.