విధత: తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో భౌతికంగా పరీక్షలు నిర్వహించకుండా ఆన్‌లైన్లో నిర్వహించాలని పిటీషన్ దాఖలైంది. కాగా పిల్‌కు లంచ్ మోషన్ అడిగిన అడ్వకేట్ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయని… తాము ఇందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.