హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరంట్స్ ఫోరం అప్పీలుపై హైకోర్టు విచారణ

విధాత‌:ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిటిషనర్ల వాదన. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్ లైన్ తరగతులు బోధించడం లేదన్న పిటిషనర్లు. పది శాతం ఫీజు పెంపును వెనక్కి తీసుకోవడంతో పాటు.. రూ.10వేలు తగ్గించామన్న హెచ్ పీఎస్. ఫీజులో ఎంత శాతం తగ్గించారో తెలపాలన్న హైకోర్టు. ఫీజు చెల్లించలేదని ఆన్ లైన్ తరగతులు ఎలా ఆపుతారని ప్రశ్నించిన హైకోర్టు. పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనన్న హైకోర్టు. లాభాపేక్ష లేని సొసైటీ కూడా కార్పొరేట్ సంస్థల్లా […]

  • Publish Date - July 6, 2021 / 05:01 PM IST

విధాత‌:ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిటిషనర్ల వాదన. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్ లైన్ తరగతులు బోధించడం లేదన్న పిటిషనర్లు. పది శాతం ఫీజు పెంపును వెనక్కి తీసుకోవడంతో పాటు.. రూ.10వేలు తగ్గించామన్న హెచ్ పీఎస్. ఫీజులో ఎంత శాతం తగ్గించారో తెలపాలన్న హైకోర్టు. ఫీజు చెల్లించలేదని ఆన్ లైన్ తరగతులు ఎలా ఆపుతారని ప్రశ్నించిన హైకోర్టు. పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనన్న హైకోర్టు. లాభాపేక్ష లేని సొసైటీ కూడా కార్పొరేట్ సంస్థల్లా వ్యవహరిస్తే ఎలా అన్న హైకోర్టు. కరోనా విపత్తు వేళ మానవీయంగా వ్యవహరించాలన్న హైకోర్టు
ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనన్న హైకోర్టు. ఫీజులతో ముడిపెట్టకుండా ఆన్ లైన్ బోధన కొనసాగించాలని స్పష్టం చేసిన హైకోర్టు. ఎంత మంది.. ఎంత మేరకు ఫీజులు చెల్లించాలో వివరాలు తెలపాలన్న హైకోర్టు. విచారణ ఈనెల 13కి వాయిదా వేసిన హైకోర్టు.