Washing Machine Blast | హైదరాబాద్‌లో పేలిన వాషింగ్ మిషన్

సాధారణంగా ఇండ్లల్లో వాడే వస్తువుల్లో సిలిండర్, ఫ్రిడ్జ్ లు ప్రమాదవశాత్తు పేలడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ, తాజాగా అరుదుగా జరిగే ప్రమాదం హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Reported by: chinna | తెలంగాణ‌ | Nov 27, 2025, 7:54 pm IST
Read Time: 3 mins
Washing Machine Blast | హైదరాబాద్‌లో పేలిన వాషింగ్ మిషన్

విధాత, హైదరాబాద్ :

సాధారణంగా ఇండ్లల్లో వాడే వస్తువుల్లో సిలిండర్, ఫ్రిడ్జ్ లు ప్రమాదవశాత్తు పేలడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ, తాజాగా అరుదుగా జరిగే ప్రమాదం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అమీర్‌పేట్‌లోని ఓ ఇంట్లో వాషింగ్‌ మెషిన్‌ ఒక్కసారిగా పేలడంతో తీవ్ర శబ్ధం వచ్చిందది. ఇంట్లో ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు పెరిగిన ఈ రోజుల్లో, భద్రతా జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు ఇలా సంభవిస్తాయన్నది ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

గురువారం జరిగిన ఈ ఘటనతో ఇంట్లో ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. ఆ సమయంలో వాషింగ్‌ మెషిన్‌ రన్నింగ్‌లో ఉండగా, అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు తీవ్రత అధికంగా ఉండడంతో వాషింగ్ మెషిన్‌ తునాతునకలైపోయింది. లోపలి పార్ట్స్‌ ఎగిరిపడి సీలింగ్‌ను తాకి కింద పడిపోయాయి. బాధితురాలి వివరాల ప్రకారం.. భారీ శబ్దం వినగానే అందరూ భయంతో పరుగులు తీశారని, అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన సమయంలో బాల్కనీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా అక్కడ ఉంటే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశముందని ఆమె తెలిపారు. అయితే, వాషింగ్‌ మెషిన్‌ ఎందుకు పేలింది? తయారీ లోపమా? లేక మెయింటెనెన్స్‌ సమస్యలా? అనే అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ సంఘటనతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం స్థానికులకు ఊపిరి పీల్చుకున్నారు.