6న విచారణకు రావాలి.. కేఎల్ఆర్, పారిజాతాలకు నోటీసులు

  • Publish Date - November 3, 2023 / 04:36 AM IST

విధాత : కాంగ్రెస్ నేతలు కేఎల్ఆర్, పారిజాత నరసింహ రెడ్డి ఇళ్ళలో ఐటీ సోదాలు ముగిశాయి. వారి ఇళ్లలో నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 6న ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పారిజాత నరసింహారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు విప్పర్ వ్యాలీ విల్లాస్, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి నివాసంలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రఘువీర్ రెడ్డి వ్యాపార లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు.