Kavitha New Party : రేపే కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

కల్వకుంట్ల కవిత రేపు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ పేరు, జెండా, ఎజెండాపై కీలక వివరాలు వెల్లడి కానున్నాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 26, 2026, 4:22 pm IST
Read Time: 3 mins
Kavitha New Party : రేపే కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా వివరాలను ప్రకటించనున్నారు. కవిత రేపు ఉదయం 8 గంటలకు నిజామాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో కొత్త రాజకీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నట్లుగా జాగృతి వర్గాల సమాచారం. పార్టీ పేరు, ఎజెండా, తాను పోటీ చేసే నియోజకవర్గం​పై క్లారిటీ ఇస్తారని జాగృతి వర్గాలు తెలిపాయి.

అనంతరం కవిత ఉదయం 9.30 గంటలకు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొంటారు.

తెలంగాణ ప్రజా జాగృతి పేరు ఖరారు?

కవిత ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసిన వివరాల ప్రకారం ఆమె పెట్టబోయే కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి… పార్టీ గుర్తు ధర్మగంట అని సమాచారం. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం ప్రకారం.. సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా తమ పార్టీ పని చేయనున్నట్లు కవిత ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ఎజెండాలో యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ది, తెలంగాణ సాంస్కృతిక అంశాలు, ఉద్యమకారుల సమస్యలు కీలకంగా ఉంటాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

పెట్రోల్‌, డీజిల్‌కు కొరత లేదు: కేంద్రం
Ram Navami 2026 : శ్రీ రామనవమికి అయోధ్య రామ మందిరం ముస్తాబు