కాళేశ్వరం రిపోర్టుపై సా.4 గంటలకు చర్చ: మంత్రి ఉత్తమ్
సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై శాసనసభలో చర్చ జరుగుతుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు

హైదరాబాద్, ఆగస్టు 31(విధాత): సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై శాసనసభలో చర్చ జరుగుతుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం రిపోర్టు కాపీలను ఇప్పటికే అందరికీ అందించామని తెలిపారు. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాళేశ్వరం రిపోర్టుపై ప్రతిపక్షానికి కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తామన్నారు. ఇప్పటికే రెడీ చేసిన నోట్‌ను సభలో ప్రవేశపెడతామన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.