KAVITHA | తీహార్‌ జైల్లో కవితకు అస్వస్థత ..దీన్‌ దయాల్‌ ఆస్పత్రికి తరలింపు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆమెను వైద్య చికిత్స కోసం దీన్ దయాల్‌ ఆస్పత్రికి తరలించారు

KAVITHA | తీహార్‌ జైల్లో కవితకు అస్వస్థత ..దీన్‌ దయాల్‌ ఆస్పత్రికి తరలింపు

విధాత, హైదరాబాద్‌ : ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆమెను వైద్య చికిత్స కోసం దీన్ దయాల్‌ ఆస్పత్రికి తరలించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. లిక్కర్‌ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాతా ఏప్రిల్ 11న సీబీఐ సైతం కవితను జైల్లో ఉండగానే అరెస్టు చేసింది. వంద రోజులకు పైగా కవిత తీహార్‌ జైల్లోనే ఉన్నారు. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు వరుసగా కోర్టుల్లో వీగిపోతుండటంతో జైలులోనే ఉండాల్సివస్తుంది.