బీఅరెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు… ఫామ్ హౌస్ కి రావాలని సందేశం
బీఅరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి రావాలని సందేశం పంపించారు.

విధాత: బీఅరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి రావాలని సందేశం పంపించారు. మంగళవారం ఆయన తన ఫామ్ హౌస్ లో వారితో భేటీ కాను. తాజా రాజకీయ పరిస్థితులు, బీఅరెస్ నుంచి కొనసాగుతున్న వలసలపై ఆయన వారితో కీలక చర్చలు జరపరునున్నట్లు సమాచారం. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేజారిపోతారోనన్న ఆందోళనతో ఉన్న కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై వారు పార్టీ విడకుండా బుజ్జగించనున్నట్లు సమాచారం. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టపరంగా అనుసరించాల్సిన వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. జులై 15వ తేదీలోగా మరో 15 మంది బీఅరెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. పార్టీ సంస్థాగత బలోపేత అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది.