KTR Family Visits Peddamma Temple Jubilee Hills | జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు
జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లిని కేటీఆర్ దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఉప ఎన్నికకు ముందు భారీ ప్రాధాన్యత.

విధాత, హైదరాబాద్ : దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చక బృందం ఆశీర్వచనాలు..తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగునున్న తరుణంలో కేటీఆర్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకోడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగళవారం రోజునే జూబ్లీహిల్స్ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. రెండువారాల్లో ఉప ఎన్నిక షెడ్యూల్ రాబోతుండటం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి సునితను అభ్యర్థిగా ప్రకటించింది.