మంచిర్యాల కాంగ్రెస్ లో చేరికలు

  • Publish Date - October 31, 2023 / 02:42 PM IST
  • దండేపల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభం


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలోకి మంగళవారం బీఆరెస్ తో పాటు పలుసంఘాల నాయకులు చేరారు. దండేపల్లి మండలకేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దండేపల్లి మండలకేంద్ర మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు అజ్మీర్, ఈశ్వర నాయక్, మామిడాల రమేష్, మ్యాదరిపేట గ్రామానికి చెందిన మాల మహానాడు సంఘం మండల ఉపాధ్యక్షులు వసంతరావు, రాపల్లి వినోద్ తోపాటు 50 మంది యువకులు, నాగసముద్రం గ్రామానికి చెందిన రాపాల నరేష్, మామిడిపల్లి రాజ నరేష్, కాసారపు సాయి గౌడ్, నారకట్ల శేఖర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.


వెలగనూరు గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు వారికి కేటాయించిన రూ.పది లక్షలు పూర్తిస్థాయిలో ఇవ్వకుండా కేవలం రూ.ఐదు లక్షలు మాత్రమే మాకు ముట్టినవని వాపోయారు. ఎమ్మెల్యే దివాకర్ రావుకు మొరపెట్టుకున్న స్పందించలేదని, అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. వారికి ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొక్కిరాల మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని, మంచిర్యాల అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.