ఈ నెల 8న ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ లో నూతన స్టార్ట్-అప్ ల కోసం లోన్ మేళా

హైదరాబాద్, విధాత‌:కేంద్ర ప్ర‌భుత్వ ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల జాతీయ సంస్థ‌ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) నిరుద్యోగ యువ‌తీ యువ‌కులకు కొత్తగా స్టార్ట్-అప్ లు ప్రారంభించాల‌నుకొనే వారికి రుణాల మంజూరు కోసం ఈ నెల 8వ తేదీన ఉదయం 11 గంటల నుండి 5 గంటల వరకు ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ క్యాంపస్ లో లోన్ మేళా నిర్వహిస్తోంది. చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకొనే ఔత్సాహిక యువతీ యువకులు ఈ మేళా లో పాల్గొనేందుకు తమ ప్రాజెక్టు […]

  • Publish Date - July 6, 2021 / 05:04 PM IST

హైదరాబాద్, విధాత‌:కేంద్ర ప్ర‌భుత్వ ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల జాతీయ సంస్థ‌ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) నిరుద్యోగ యువ‌తీ యువ‌కులకు కొత్తగా స్టార్ట్-అప్ లు ప్రారంభించాల‌నుకొనే వారికి రుణాల మంజూరు కోసం ఈ నెల 8వ తేదీన ఉదయం 11 గంటల నుండి 5 గంటల వరకు ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ క్యాంపస్ లో లోన్ మేళా నిర్వహిస్తోంది. చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకొనే ఔత్సాహిక యువతీ యువకులు ఈ మేళా లో పాల్గొనేందుకు తమ ప్రాజెక్టు రిపోర్టు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు ఫొటో, పాన్ నెంబర్, మూడు సంవత్సరాల బ్యాంకు లావాదేవీల వివరాలను తీసుకురావాల్సి ఉంటుందని ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ఒక ప్రకటలో తెలిపింది. ఇతర వివరాలకు శ్రీ సుదర్శన్, మొబైల్ నెంబర్ 9494959108 ను సంప్రదించగలరు.