Lovers Romance | హైదరాబాద్ రోడ్లపై రొమాన్స్.. బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో
Lovers Romance | ప్రేమికులు( Lovers ) బరితెగించారు. అదేదో రహస్యంగా చేయాల్సిన పనిని.. రోడ్లపైనే చేసేస్తున్నారు. ఆ ప్రేమికుల విన్యాసాలతో ప్రజలకు విసుగు పుడుతోంది. పట్టపగలే.. నడిరోడ్డుపై బెక్‌పై దూసుకెళ్తూ ఓ ప్రేమజంట ముద్దుల్లో( Lovers Romance ) మునిగిపోయింది.

Lovers Romance | యూత్ బైక్ స్టంట్లు( Bike Stunts ) చేయడం కామన్ అయిపోయింది. ఇటీవలి కాలంలో బైక్‌లపై ప్రేమ విన్యాసాలు( Lovers Romance ) ఎక్కువై పోయాయి. ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ప్రేమికులు బైక్‌లపై విహరిస్తూ రొమాన్స్( Romance )లో మునిగిపోయిన ఘటనలు అనేకం చూశాం. ఇప్పుడు ఆ సంస్కృతి హైదరాబాద్( Hyderabad )కు పాకిపోయింది. సాధారణంగా పార్కు( Park )ల్లో కనిపించే రొమాన్స్ సీన్లు ఇప్పుడు నడి రోడ్లపైనే దర్శనమిస్తున్నాయి. బరితెగించిన ఓ ప్రేమ జంట( Lovers ).. ముద్దుల్లో( Kiss ) మునిగిపోయి, కౌగిలింతలతో( Hug ) రెచ్చిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీ షరీఫ్( Pahadi Shareef ) ప్రధాన రహదారిపై వెలుగు చూసింది.
ఇక ప్రియుడు( Boy Friend ) బైక్ నడుపుతుంటే.. ప్రియురాలేమో( Girl Friend ) పెట్రోల్ ట్యాంక్‌పై అతనికి ఎదురుగా కూర్చుంది. హెల్మెట్ ధరించి ఉన్న తన ప్రియుడికి ముద్దులు పెడుతూ.. చిరునవ్వులు చిందించింది. అంతటితో ఆగకుండా అతన్ని గట్టిగా కౌగిలించుకుంటూ సంబురపడిపోయింది. ఈ ప్రేమికుల బరితెగింపు చేష్టలకు రోడ్డున పోయేవారు అవాక్కయ్యారు. ప్రియుడు కూడా ఆమెకు సహకరిస్తూ.. సరసాల్లో మునిగిపోయాడు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ ప్రేమికుల విన్యాసం.. సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పోలీసులు( Police ) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నడి రోడ్డు మీద బైక్ పై అసభ్యంగా ప్రవర్తించిన ప్రేమ జంట
హైదరాబాద్ – నగర శివార్లలోని పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిపై బైక్ మీద వెళ్తూ అసభ్యంగా ప్రవర్తించిన ప్రేమ జంట pic.twitter.com/VZ5bZ1nrju
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024