మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడు

విధాత‌ : రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల సదస్సులు నిర్వహిస్తున్నందున సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్ హౌస్ నుండి వాసాలమర్రి దళితులతో చర్చలకు బయలుదేరాడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హుజురాబాద్ నుండి పైలట్ ప్రాజెక్ట్‌గా దళిత బంధు పథకం అమలుతో మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరగలేదన్నారు. దళిత ముఖ్యమంత్రిగా, మూడు ఎకరాల భూమి, కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్ మాట తప్పి […]

మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడు

విధాత‌ : రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల సదస్సులు నిర్వహిస్తున్నందున సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్ హౌస్ నుండి వాసాలమర్రి దళితులతో చర్చలకు బయలుదేరాడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హుజురాబాద్ నుండి పైలట్ ప్రాజెక్ట్‌గా దళిత బంధు పథకం అమలుతో మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరగలేదన్నారు. దళిత ముఖ్యమంత్రిగా, మూడు ఎకరాల భూమి, కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్ మాట తప్పి గద్దెనెక్కడన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులు, మంత్రులు దళితులు లేరన్నారు.