Manda Krishna Madiga | మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బృందం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు.

  • By: Somu |    telangana |    Published on : Aug 23, 2024 5:05 PM IST
Manda Krishna Madiga | మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బృందం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామాత్యులు దామోదరం రాజనర్సింహాతో పాటు మందకృష్ణ కోమటిరెడ్డిని కలిసి .ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య , మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు , మాజీ ఎంపీ పసునూరి దయాకర్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.