Warangal MGM | ఎంజీఎం హాస్పిటల్ డాక్టర్లు, ఉద్యోగులకు మెమోలు
Warangal MGM | వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు, ఉద్యోగులు కలిపి 77 మందికి ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ మెమోలు జారీ చేసి రికార్డు సృష్టించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ చర్యలు చేపట్టారు.

77 మందికి అధికారులు మెమోలు జారీ
కలకలంరేపుతోన్న అధికారుల చర్యలు
Warangal MGM | వరంగల్ , విధాత: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు, ఉద్యోగులు కలిపి 77 మందికి ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ మెమోలు జారీ చేసి రికార్డు సృష్టించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణ జరిపి రిజిస్టర్లో సంతకాలు చేయని వైద్యులు, ఉద్యోగులతో పాటుగా విధులకు హాజరుకాని వైద్యులు, ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు.
శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైద్యులు విధులకు హాజరుకాకపోవడం, శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా విధులకు హాజరుకాకపోవడం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న 77 మందికి సోమవారం మెమోలు జారీ చేశారు.. అంతేకాదు.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ప్రజాప్రతినిధులు ఫోన్ లో కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ విధులకు హాజరు కాని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల నుంచి వివరణ కోరుతూ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఎంజీఎం చరిత్రలో ఓ ఒక్క రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు 77 మందికి మెమోలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఎంజీఎం డాక్టర్లు, ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.