విధాత, హైదరాబాద్: తన సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం తనతో మాట్లాడలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరే విషయం అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.
నల్లగొండ నియోజక వర్గానికి చెందిన నేతలు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 70,80 సీట్లలో గెలుస్తుందని తెలిపారు. తనను అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని అన్నారు.