కేసీఆర్ కుటుంబ స్కాములన్ని బయటకు వస్తాయి: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

కేసీఆర్ కుటుంబం చేసిన స్కాములన్నీ బయటకు వస్తాయని, పార్లమెంటు ఎన్నికల తర్వారా వారికి నిద్ర ఉండదని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటు విమర్శలు చేశారు.

  • Publish Date - April 21, 2024 / 05:40 PM IST

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

విధాత : కేసీఆర్ కుటుంబం చేసిన స్కాములన్నీ బయటకు వస్తాయని, పార్లమెంటు ఎన్నికల తర్వారా వారికి నిద్ర ఉండదని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆరెస్ పదేళ్ల పాలనలో చేసిన అవినీతి, అక్రమాలు, దోపిడీ విచారణ సాగుతుందన్నారు. అక్రమాలలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం చేసిన వారికి జైలు తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభ్వుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితులను రాసి రంపాన పెట్టిందని అగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు. మల్లన్న సాగర్‌లో కుంభకోణాల చిట్టా విప్పుతామని దోషులను శిక్షిస్తామన్నారు. 24మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అలా చెప్పిన కేసీఆర్ పై ప్రజలు తిరగబడతారన్నారు.