వెనక్కి తగ్గిన గాలి..నర్సాపూర్ కాంగ్రెస్ లో ఐక్యతా రాగం

  • Publish Date - November 11, 2023 / 02:15 PM IST

– ఒక్కటైన గాలి…ఆవుల

– ఆవుల రాజిరెడ్డిని గెలిపించుకుంటాం

– గాలి అనిల్ కుమార్, ఆంజనేయులు గౌడ్ వెల్లడి

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ లో అసమ్మతి చల్లబడ్డది. ఆపార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, సుహాసిని రెడ్డిలు జరిపిన చర్చలు ఫలించాయి. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గాలి అనిల్ కుమార్, పీసీసీ సభ్యులు ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డిలతో శనివారం సాయంత్రం సుహాసిని రెడ్డి నివాసంలో చర్చలు చేశారు. గాలి అనిల్ కుమార్, ఆయన వర్గం నేతలు వారం రోజులుగా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


ఆవుల రాజిరెడ్డి నామినేషన్ వేసిన రోజునే గాలి అనిల్ కుమార్ కూడా నర్సాపూర్ లో భారీ రోడ్ షో నిర్వహించి, నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో గాలి అనిల్ కుమార్ కు ఆవుల రాజిరెడ్డి సహకరించే విధంగా చర్చలు జరిగినట్లు సమాచారం. ఎంపీగా పోటీ చేస్తే బేషరతుగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చర్చలు అనంతరం గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు.