Telangana | తెలంగాణ భూమి హక్కుల ముసాయిదా చట్టం ఇదే..
ధరణి సమస్యల పరిష్కారానికి నూతన ఆర్.ఓ.ఆర్. ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది.

విధాత: ధరణి సమస్యల పరిష్కారానికి నూతన ఆర్.ఓ.ఆర్. ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమెయిన్లో పెడుతున్నట్లు ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రకటించారు. దీనిపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎస్ఏ వెబ్ సైట్ (https://ccla.telangana.gov.in/Welcome.do) అందుబాటులోకి తెచ్చారు.
ఆగస్ట్ 2వ తేదీ నుంచి ఆగస్ట్ 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించింది. ప్రజలు తమ సలహాలు సూచనలను ఈ మెయిల్ (ror2024-rev@telangana.gov.in) చేయాలి. పోస్ట్ ద్వారా సీసీఎస్ఏ కార్యాలయానికి పంపించవచ్చు.
చిరునామా; ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎస్ఏ కార్యాలయం, నాంపల్లి, స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబిడ్స్, హైదరాబాద్ 500001.
తెలంగాణ భూమి హక్కుల ముసాయిదా చట్టం ఇదే..
Read More;
Neeraj Chopra | ఫైనల్స్ లోకి నీరజ్ చోప్రా..బంగారు పతకంపై ఆశలు