విధాత: ఈనెల 6న(సోమవారం) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ‘‘అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈక్రమంలో హైదరాబాద్‌లో 3- 4 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన కనిపిస్తోంది’’ అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.