విధాత: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేసేందుకు నిర్వహించే తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసెట్ కన్వీనర్ ఆచార్య లక్ష్మీనారాయణ ఓయూలో ఫలితాలు విడుదల చేశారు. గత నెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 22,834 మంది హాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 17,864 మంది, వరంగల్‌లో 5,323 మంది పరీక్ష రాసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.