Prostitution Racket Busted In Begumpet : ఛీ..పాడు పనికి శ్మశానాన్ని వదల్లేదు !
హైదరాబాద్ ధనియాలగుట్ట శ్మశానవాటికలో గదిలో సాగిన వ్యభిచార దందా పోలీసులు రట్టు చేసి నిందితురాలు మాధవిని అరెస్టు చేశారు.

విధాత, హైదారాబాద్ : కామాతురణం.. నభయం..నలజ్జ అంటే ఇదేనేమో. వ్యభిచార దందా కోసం కొందరు చివరకు శ్మశాన వాటికను సైతం వదల్లేదు. శ్మశాన వాటికలో సాగుతున్న గదిలో వ్యభిచార కార్యకలాపాలను సాగిస్తున్న నిర్వాకాన్ని హైదరాబాద్ పోలీసులు రట్టు చేయగా..ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బేగంపేట ధనియాలగుట్ట శ్మశానవాటికలోని గదిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మరో మహిళతో పాటు విటుడిగా వచ్చిన వ్యక్తికి నోటీసులు అందజేశారు. బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు తెలిపారు.
ధనియాలుగుట్ట శ్మశానవాటికలోని ఓ గదిలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసననీయ సమచారం మేరకు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న మారి మాధవి(39)ని అరెస్టు చేశారు. అదే సమయంలో గదిలో ఉన్న ఓ మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. నిందితురాలు మాధవిపై గతంలో బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.