రైతుల ఖాతాల్లోకి ఈ నెలలోనే రైతు భరోసా నిధులు

రైతు భరోసా నిధులు ఇదే జూన్ నెలాఖరులోగా రైతుల ఖతాల్లో విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. యాసంగి రైతు భరోసా తరహాలో ఎకరం చొప్పున కాకుండా ఈ ధఫా రైతు వారిగా ఒకేసారి..అంటే రైతుకు ఎన్ని ఎకరాలుంటే అన్నింటికి ఒకేసారి పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రైతు భరోసా నిధులు ఇదే జూన్ నెలాఖరులోగా రైతుల ఖతాల్లో విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. యాసంగి రైతు భరోసా తరహాలో ఎకరం చొప్పున కాకుండా ఈ ధఫా రైతు వారిగా ఒకేసారి..అంటే రైతుకు ఎన్ని ఎకరాలుంటే అన్నింటికి ఒకేసారి పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18న జరిగే కేబినెట్ భేటీలో యాసంగి రైతు భరోసా మూడో విడత పెండింగ్ నిధులతో పాటు ఖరీఫ్ పంట సీజన్ రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.

జూన్ నెలాఖరులోగా ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు నిధుల సమీకరణలో ప్రభుత్వం నిమగ్నమైంది. తెలంగాణలో 67.01లక్షల మంది రైతులకు రూ.138కోట్ల ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల కానున్నట్లుగా సమాచారం. తొమ్మిది రోజులలో రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జూన్ 20వ తేదీన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 23వ విడత నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లుగా వెల్లడించడం గమనార్హం.

 

Latest News