విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని రాజనాల శ్రీహరి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తీరుపై రాజనాల శ్రీహరి ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ రెబల్ గా పోటీలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈసందర్భంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
కబ్జా కోరుకు తూర్పు టికెట్
బీఆర్ఎస్ రౌడీలకు, కబ్జా కోరులకు, రేపిస్టులకు బీఫాం ఇచ్చిందని శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేందర్ 100 కోట్లను అధిష్టానానికి ముట్టజెప్పి టికెట్ దక్కించుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ తూర్పు టికెట్ పై అధిష్టానం మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నరేందర్‌ను ఓడిస్తానని ప్రకటించారు.