మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆరెస్‌లో చేరిన రావుల

  • Publish Date - October 20, 2023 / 11:17 AM IST

విధాత : వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జ‌గ‌న్నాథంతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి టీడీపీ త‌ర‌పున 1994, 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నియోజక‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఏపీ ప్ర‌భుత్వ విప్‌గా ప‌ని చేశారు. గతంలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ఎన్నిక‌య్యారు. ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నారు.



 హరీష్ రావు సమక్షంలో బీఆరెస్‌లో చేరిన కాలేరు


మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో స్థానిక నేత కాలేరు శంకర్‌ తన అనుచరులతో కలిసి బీఆరెస్‌లో చేరారు. శంకర్‌తో పాటు రాఘవేంద్ర ముదిరాజ్, సాయికిరణ్ ముదిరాజ్, రమణ, సంజయ్‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.