తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకే మద్దతునిస్తుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరీ వెల్లడించారు.

- సీఎం అభ్యర్థిపై హైకమాండ్‌దే నిర్ణయం
- మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరీ
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకే మద్దతునిస్తుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరీ వెల్లడించారు. సోమవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన రేణుకాచౌదరీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు కష్టకాలంలో సహకరించిందన్నారు. టిడిపి వాళ్ళు మాకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీఎం రైసులో ఐదారుగురు ఉన్నారని, సీఎం అభ్యర్థి ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కీలకంగా పనిచేశారని, పార్టీ హైకమాండ్ సిద్ధరామయ్యను సీఎంగా నిర్ణయించిందని, శివకుమార్ మాదిగా త్యాగం చేసే గుణం ఉండాలన్నారు. ఐటీలో కేటీఆర్ కింగ్ అంటారని, ఉద్యోగాలు మాత్రం ఇవ్వరన్నారు.
రైతులకు బేడీలు వేసిన బీఆరెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న బీఆరెస్ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎన్ని విధాలా ఇబ్బందులు పెట్టినా గెలిచేది మేమేనని, డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆరెస్ పార్టీ అప్రజాస్వామిక, నియంతృత్వ, అవినీతి, రాజ్యంగ వ్యతిరేక పాలన వంటి స్వయంకృత అపరాదాలే ఆ పార్టీకి ఓటమికి కారణలవుతాయన్నారు.
