రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ తొలి సమావేశం

విధాత‌:రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ తొలి సమావేశం గురువారం జరగనుంది. గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన సమస్య అయిన నిరుద్యోగంపై పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించే విషయంపై చర్చించే అవకాశం ఉంది. అయితే దీనిపై కార్యక్రమం చేపట్టాలా, పాదయాత్ర చేపట్టాలా అన్నదానిపైనా చర్చించనున్నట్లు చెబుతున్నారు. తొలుత ఉదయం 10 గంటలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, […]

  • Publish Date - July 8, 2021 / 05:54 AM IST

విధాత‌:రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ తొలి సమావేశం గురువారం జరగనుంది. గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన సమస్య అయిన నిరుద్యోగంపై పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించే విషయంపై చర్చించే అవకాశం ఉంది. అయితే దీనిపై కార్యక్రమం చేపట్టాలా, పాదయాత్ర చేపట్టాలా అన్నదానిపైనా చర్చించనున్నట్లు చెబుతున్నారు. తొలుత ఉదయం 10 గంటలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, కమిటీ చైర్మన్లతో సమావేశమవుతారు. అనంతరం డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు.