విధాత : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ సవరణ చట్టం తెచ్చి శాశ్వతంగా అధికారంలో కొనసాగేందుకు కుట్ర రాజకీయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని, 2023 పాత బిల్లును సోమవారం పార్లమెంటులో పెడితే మా పార్టీ, కూటమి పార్టీలు మద్దతునిచ్చేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. అప్పుడు ఎవరి చిత్తశుద్ధి ఏమిటో ప్రజల్లో ఎవరికి మద్దతు ఉందో తేలుతుందన్నారు. యూపీ ఎన్నికలలోపు మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదానికి దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పారు. గంటలో చట్ట సవరణ చేసుకుని తెస్తామని అమిత్ షా చెప్పారని, మహిళా రిజర్వేషన్ల కోసం సోమవారం ప్రత్యేక సమావేశం పెట్టండని రేవంత్ రెడ్డి డిమాండ్ చేవశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కోటా ఉండాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అడ్డు కాదు అని, ప్రధాని పంతాలకు పోకుండా 2023మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలన్నారు.
బీజేపీ విధానాలకు ఇది ఓటమి
మహిళా బిల్లు వీగిపోవడంతో బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మహిళా బిల్లు వీగిపోవడం.. బీజేపీ విధానాల ఓటమిగా భావించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బిల్లుపై ప్రధాని మోదీకి నిజాయతీ లేదని విమర్శించారు. నిజాయతీగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే.. పార్లమెంట్‌లో అందరూ మద్దతు తెలిపేవారన్నారు. దేశ ప్రజలు హనుమంతుల్లా బలవంతమైన భీముడులాంటి మోదీని ఓడించారు అని రేవంత్ చెప్పుకొచ్చారు. ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టందుకు రాజ్యాంగ సవరణ బిల్లుతో ప్రయత్నించిందని, మాకు దేశం ముఖ్యం రాజకీయాలు కాదు అని, అందుకే ఆ బిల్లును వ్యతిరేకించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2024లో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని చూశారు అని, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల ముసుగులో రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నించారు అని ఆరోపించారు. కేంద్రం కుట్రలను విపక్షాలు సమర్థంగా అడ్డుకున్నాయి అన్నారు. ఇలాంటి తప్పుడు చట్టాలు తెస్తే ప్రజాక్షేత్రంతోపాటు పార్లమెంటులోనూ మేము అడ్డుకుంటాం అని స్పష్టం చేశారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వ ఓటమిని ప్రజలు చూశారు అని, చిత్తశుద్ధి లేని చట్టాలు తేవాలని చూస్తే విపక్షాలు అడ్డుకున్నాయని తెలిపారు. బీజేపీ అహంకారం, రాజకీయ దురుద్దేశాన్ని ఓడించారు అని రేవంత్ పేర్కొన్నారు.
చంద్రబాబుకు నితీశ్, షిండేల పరిస్థితే
మోదీ ప్రభుత్వ విధాానాలకు మద్దతునిస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనగడ ప్రశ్నార్థకమేనని, నితీష్ కుమార్, ఏక్ నాధ్ షిండేల పరిస్థితి చూస్తూనే ఉన్నాం అని…చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నందునే ప్రస్తుతం టీడీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారని, భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పెడుతారని తెలిపారు.
JD Chakravarthy | జేడీ చక్రవర్తి భార్యని ఎప్పుడైన చూశారా.. ఆయన భార్య టాలీవుడ్‌లో క్రేజీ హీరోయినా?
టార్గెట్ రేవంత్‌రెడ్డి.. పొలిటికల్ గేమ్ చేంజర్‌గా జగిత్యాల బీఆరెస్ సభ?
