ఇంటి దొంగలకు రేవంత్ డెడ్లైన్

విధాత‌:పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ రేవంత్ రెడ్డి డెడ్‌లైన్ విధించారు.ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను అధికారులు ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ఇబ్బంది పెట్టే వారి డైరీ రాస్తున్నామని, వేధించిన అధికారుల మోకాలి చిప్పలు పగల గొట్టిస్తామని హెచ్చరించారు. అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని, చట్ట పరిధిలో పని చేయాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మూల్యం […]

  • Publish Date - July 12, 2021 / 04:31 PM IST

విధాత‌:పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ రేవంత్ రెడ్డి డెడ్‌లైన్ విధించారు.ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను అధికారులు ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ఇబ్బంది పెట్టే వారి డైరీ రాస్తున్నామని, వేధించిన అధికారుల మోకాలి చిప్పలు పగల గొట్టిస్తామని హెచ్చరించారు. అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని, చట్ట పరిధిలో పని చేయాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మూల్యం చెల్లిస్తారని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.