విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం కరీంనగర్ నగర్ లో చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి వాహనంపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెప్పుతో దాడి చేసాడు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న టీచర్ జగదీశ్వరాచారి తన చెప్పుతో మంత్రి గంగుల ప్రచార వాహనంపై దాడి చేశారు.
అంతేకాకుండా అసభ్యకరంగా దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. దీంతో అవాక్కైన పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. చెప్పుతో దాడి సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కరీంనగర్ లోని ఓ కల్యాణ మండపం వేదికలో జరిగిన సమావేశంలోనూ సదరు ప్రభుత్వ టీచర్ మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్దేశించి దుర్భాషలాడుతూ, హంగామా సృష్టించిన్నట్లు సమాచారం.