Seethakka Counters To KTR : ఫిరాయింపు రాజకీయాలకు కేసీఆర్ పితామహుడు
ఫిరాయింపు రాజకీయాల పితామహుడు కేసీఆర్ అని మంత్రి సీతక్క కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తలసాని, సబితల ప్రమాణ స్వీకారాన్ని ఉదాహరించారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విధాత): ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కామారెడ్డిలో ఆమె మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలకు ఆజ్యం పోసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఫిరాయింపు సంస్కృతికి పితామహుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. పరాయి పార్టీల్లో గెలిచిన తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డిని మంత్రులుగా ప్రమాణం చేయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ధ్వజమెత్తారు.
నాడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ రాజీనామాలు చేయించారా అని ప్రశ్నించారు. పార్టీ మారిన వారితో అప్పుడు రాజీనామా చేయించి మాట్లాడితే మంచిదని అన్నారు. నాడు రాజ్యంగాన్ని ఉల్లఘించిన మీకు రాజ్యంగ ధర్మాసనాన్ని ఆశ్రయించే నైతిక హక్కు లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు.