గ్రీన్ ఎనర్జీ..మినరల్స్ లో స్వావలంబనకు కేంద్రం ముందడుగు : కిషన్ రెడ్డి

విధాత, హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీతో పాటు లిథియం సహా ఇతర మినరల్స్ లో స్వావలంబన సాధనకు ప్రధాని మోదీ ప్రభుత్వం ముందుకెలుతుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగోల్, బండ్లగూడ లోని జీఎస్ఐటీఐలో జరిగిన “నెక్స్ట్ జనరేషన్ జియో ఫిజిక్స్ 2025” కాన్ఫరెన్స్ కు ఆయన హాజరై డ్రిల్లింగ్ విధానంలో రెండు నూతన హైడ్రాలిక్ బోర్ వెహికిల్స్ ను ప్రారంభించారు. జీఎస్ఐటీఐలో నూతన విధానాలతో కూడిన వివిధ జియాలాజికల్, సాఫ్ట్ వేర్, ఏఐ ఆధారిత విధానాలు, ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి, స్టాల్స్ ఏర్పాటు చేసిన నిపుణులతో సంభాషించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న అవసరాలకనుగుణంగా సహజ వనరులను ఉపయోగించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మినరల్ సెక్టార్ లో అందులో క్రిటికల్ మినరల్స్ కు చాలా డిమాండ్ ఉందన్నారు. క్రిటికల్ మినరల్స్ దేశంలో 100% ఇతర దేశాల మీద ఆధారపడి మనదేశంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని..అందుకే మోదీ నాయకత్వంలో క్రిటికల్ మినరల్ మిషన్ తో ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మైనింగ్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అదే స్థాయిలో వివిధ దేశాలతో కూడా క్రిటికల్ మినరల్స్ తీసుకురావడం కోసం అనేక దేశాలతో ఎంవోయులు చేసుకుంటున్నామన్నారు.
అర్జెంటీనా లాంటి దేశంతో లిథియం కు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకొని మన దేశంలో మైనింగ్ చేసి మన దేశంలోకి తీసుకురావాలనే కార్యచరణ ప్రాణాలిక రూపొందించి ముందుకు వెళ్తున్నామన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్ కు సంబంధించిన పోటీ ఏర్పడిందని.. నాలుగవ ఆర్థిక అతి పెద్ద దేశమైన భారత్ రానున్న రోజుల్లో మరింత అవసరమని స్పష్టం చేశారు.సెల్ ఫోన్, ఫేస్, కు వెళ్లే టెక్నాలజీలో కూడా లిథియం అవసరమని..బ్యాటరీలో కూడా లిథియం అవసరం ఉంటుందని..ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా లిథియం అవసరం కాబట్టి ఇలాంటి క్రిటికల్ మినరల్స్ కూడా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలతో మాట్లాడి మన దేశానికి వాటిని తెచ్చుకునే ప్రయత్నం.. ఆ వనరులను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం 2070 వరకు నెట్ జీరో లక్ష్యాలను చేరుకునే దిశగా భారత ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అడవులను పెంచుకోవడం పర్యావరణన్ని రక్షించుకోవడం.. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా మినరల్స్ ను ఉపయోగించుకోవడం సమతుల్యత పాటించే విధంగా భారత ప్రభుత్వం కార్యచరణతో ముందుకు వెళ్తుందన్నారు. రానున్న రోజుల్లో మైనింగ్ యాక్టివిటీ మినరల్స్ ఆక్టివిటీని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చి తద్వారా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి దేశంలో పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా ఎనర్జీ సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎనర్జీ సెక్యూరిటీలో ఇప్పటికీ కోల్ ఆధారితమైనటువంటి థర్మల్ పవర్ నుంచి 79% విద్యుత్ కోల్ ద్వారా ఉత్పత్తి చేస్తుందన్నారు. కోల్ కూడా అదే స్థాయిలో ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని.. రానున్న రోజుల్లో బొగ్గు ఆధారితమైనటువంటి విద్యుత్తు ఉత్పత్తిని తగ్గించాలంటే దానికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని రకాల కార్యాచరణ రూపొందించుకొని ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు వెళుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.